హైదరాబాద్ వాసులకు తీవ్ర తాగునీటి సంక్షోభం... హరీశ్ రావు ట్వీట్ వైరల్!
- హైదరాబాద్‌లో తాగునీటి సమస్య అంతకంతకూ పెరుగుతోందన్న మాజీ మంత్రి
- ఈ మేరకు ఎక్స్ వేదికగా గణాంకాలతో సహా పోస్టు
- కేసీఆర్ పాలనలో నగరం ఇంతంటి తాగునీటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య
- తెలంగాణలో భూగర్భజల నిల్వలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు తగ్గాయని నివేదికలు
హైదరాబాద్ వాసులకు తాగునీటి సమస్య రోజురోజుకీ పెరుగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గణాంకాలతో సహా పోస్ట్ పెట్టారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం ఇంతంటి తాగునీటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ నేడు, వేసవి ప్రారంభానికి ముందే బోర్లు ఎండిపోతున్నాయి, భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ప్రజలు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేయవలసి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో నీటి సంక్షోభం ఏర్పడిందని చరిత్ర చేబుతోంది, ఇప్పుడు ఇది నిరూపితమైంది.
తెలంగాణలో భూగర్భ జల నిల్వలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు తగ్గాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన క్షీణతలలో ఒకటి. హైదరాబాద్‌లో 15 శాతం అధిక వర్షపాతం ఉన్నప్పటికీ, భూగర్భజలాలు 1.33 మీటర్లు పడిపోయాయి. కూకట్‌పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ భూమికి 25.90 మీటర్ల దిగువకు భూగర్భజలాలు పడిపోయాయి. ఏమి జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా?
బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ పైపుల ద్వారా తాగునీటిని అందించింది. అలాగే మిషన్ కాకతీయతో వేలాది సరస్సులను పునరుద్ధరించింది. వేసవిలో కూడా వాటిని నిండుగా ఉంచింది. కానీ కాంగ్రెస్ హయాంలో నీటి వనరులు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం పూర్తిగా చర్య తీసుకోలేదు. వారు సరస్సులను నిర్వహించడం, పునరుద్ధరించడంలో విఫలమయ్యారు.
హైదరాబాద్‌ను తీవ్రమైన నీటి సంక్షోభం వైపు నెట్టారు. ప్రజలు తాగునీరు, గృహ అవసరాల నీటి కోసం కష్టపడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం స్వీయ ప్రమోషన్, రాజకీయ ప్రతీకారంతో బిజీగా ఉంది. హైదరాబాద్ ఎండిపోతోంది. కాంగ్రెస్ బాధ్యత నుంచి పారిపోతోంది. ఇది వారి పాలన వైఫల్యానికి నిదర్శనం" అని హరీశ్ రావు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.