ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడో స్థానం వస్తుంది: బండి సంజయ్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం
- ఓడినా, గెలిచినా పోయేదేమి లేనప్పుడు ప్రచారానికి ఎందుకొచ్చారని ప్రశ్న
- గత ప్రభుత్వం కుంభకోణాల కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్
ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పోయేదేమీ లేదని ముఖ్యమంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ప్రచారానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై మీరు విచారణ జరుపుతూ, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ కుంభకోణాలను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడు దోషులను లోపల వేస్తామని తేల్చి చెప్పారు.