తెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్!
- ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- రేపు సాయంత్రం నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు బంద్
- మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు కూడా బంద్
ఈ క్రమంలో రేపటి నుండి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.