నిన్నటి పోరులో హార్దిక్ పాండ్యా ధ‌రించిన వాచ్ ధ‌ర ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

  • రిచ‌ర్డ్ మిల్లె కంపెనీకి చెందిన అరుదైన వాచ్ ధ‌రించిన భార‌త‌ ఆల్ రౌండ‌ర్‌
  • ఆ వాచ్ ధ‌ర రూ. 6.92 కోట్లు అని తెలిసి షాక‌వుతున్న నెటిజ‌న్లు
  • ప్రపంచవ్యాప్తంగా చాలా త‌క్కువ మంది వ‌ద్ద మాత్ర‌మే ఈ అల్ట్రా-లగ్జరీ వాచ్
ఆదివారం నాడు పాకిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త ఆల్ రౌండ‌ర్ హార్దిక పాండ్యా అంద‌రీ దృష్టిని ఆక‌ర్షించాడు. అయితే, అది త‌న ఆట‌తో కాకుండా తాను ధ‌రించిన చేతి గ‌డియారంతో కావ‌డం గ‌మ‌నార్హం. అత‌ను ధ‌రించిన ఆ ఖ‌రీదైన వాచ్ ఫొటోలను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తుండ‌టంతో నెట్టింట‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  

రిచ‌ర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధ‌ర అక్ష‌రాలా రూ. 6.92 కోట్లు అని తెలుస్తోంది. ఈ అల్ట్రా-లగ్జరీ వాచ్ ప్రపంచవ్యాప్తంగా చాలా త‌క్కువ మంది వ‌ద్ద మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఈ అరుదైన గడియారాన్ని మొదట టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ కోసం రూపొందించారని తెలుస్తోంది. 

ఇది కార్బన్ టీపీటీ యూనిబాడీ బేస్‌ప్లేట్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది సాటిలేని మన్నికను ఇస్తుంది. అలాంటి గడియారాలు ఇప్పటివరకు 50 మాత్రమే ఉత్పత్తి చేసినట్టు స‌మాచారం. ర‌ఫెల్ నాద‌ల్‌, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారుల‌తో పాటు గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ గ‌డియారాన్ని క‌లిగి ఉన్నార‌ని తెలుస్తోంది. 


More Telugu News