ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... జగన్ హాజరయ్యే అవకాశం!
- మరో రెండ్రోజుల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం
- అసెంబ్లీకి ఒకరోజు వచ్చి వెళ్లిపోయే ఆలోచనలో జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు
కాగా, ఈసారి వైసీపీ అధినేత జగన్ తో పాటు, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. ఎందుకంటే... వరుసగా 60 పనిదినాల పాటు అసెంబ్లీకి హాజరుకాకపోతే, సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ లెక్కన జగన్ కు అనర్హత ముప్పు పొంచి ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో... జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.