చెత్త పన్నుకు ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం... గెజిట్ జారీ
- చెత్త పన్ను విధించిన గత వైసీపీ ప్రభుత్వం
- గత డిసెంబర్ 31న చెత్త పన్నును రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
- తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నును విధించినప్పటి నుంచి అప్పుడు విపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకున్నారు. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది.