ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్టరీ గ‌ర్ల్‌తో శిఖర్ ధావన్.. ఆమె ఎవ‌రంటూ తెగ వెతికేస్తున్న నెటిజ‌న్లు!

  • ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మాజీ క్రికెట‌ర్‌
  • బంగ్లాతో మ్యాచ్‌లో మిస్టరీ గ‌ర్ల్‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన గ‌బ్బ‌ర్‌
  • దాంతో ఆ ఇద్ద‌రి ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌
టీమిండియా మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కు ఈసారి ఐసీసీ న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను అంబాసిడ‌ర్లుగా నియ‌మించ‌గా.. వారిలో ధావ‌న్ ఒక‌డు. 

ఈ క్ర‌మంలో గురువారం దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు గ‌బ్బ‌ర్ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా మైదానంలో భార‌త ఆట‌గాళ్ల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. ఆ త‌ర్వాత స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూశాడు. అయితే, మ్యాచ్ వీక్షించిన స‌మ‌యంలో అత‌ని ప‌క్క‌న ఓ మ‌హిళ క‌నిపించింది. ఆ ఇద్ద‌రి ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

దాంతో ఆమె ఎవ‌రంటూ అభిమానులు, నెటిజ‌న్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అలాగే వారిద్దరి మధ్య సంబంధం గురించి కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, గ‌బ్బ‌ర్‌తో క‌లిసి మ్యాచ్ చూసిన ఆ మహిళ ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అని ప‌లు మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. వారి సంబంధం గురించి అధికారికంగా ఏమీ తెలియకపోయినా, ధావన్ సోషల్ మీడియాలో షైన్‌ను అనుసరిస్తున్నాడు. 

ఇక బంగ్లాతో మ్యాచ్‌కు ముందు శిఖ‌ర్ ధావ‌న్ మాట్లాడుతూ... ఈసారి ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచే జ‌ట్ల‌లో భార‌త్ ముందు వ‌రుస‌లో ఉంటుంద‌న్నాడు. అయితే, స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా జ‌ట్టుకు దూరం కావ‌డం కొంత ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు. అత‌డు టీమ్‌లో ఉంటే.. విజ‌యావ‌కాశాలు మ‌రింత పెరిగేవ‌ని చెప్పుకొచ్చాడు.   


More Telugu News