పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో ఇదిగో

Kollagottinadhiro song promo from Harihara Veeramallu out now
  • 'పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో 'హరిహర వీరమల్లు
  • ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో చిత్రం
  • ఫిబ్రవరి 24న 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ రిలీజ్
  • ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ చిత్రం 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్'. ఈ పీరియాడిక్ చిత్రం నుంచి రెండో సింగిల్ రానుంది. ఫిబ్రవరి 24న 'కొల్లగొట్టిందిరో' సాంగ్ రిలీజ్ కానుండగా... నేడు ఆ పాట ప్రోమో విడుదల చేశారు. యూట్యూబ్ లో ఈ ప్రోమోకు రెస్పాన్స్ మామూలుగా లేదు. లైక్స్ మీటర్ పరుగులు పెడుతోంది. 

"కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో" అంటూ సాగే ఈ పాటలో పవన్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, నటి అనసూయలను చూడొచ్చు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు. 

కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి అత్యధిక భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలుండగానే క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తాజాగా, సాంగ్ ప్రోమో రిలీజ్ లో టైటిల్స్ లో 'దర్శకత్వం జ్యోతికృష్ణ-క్రిష్ జాగర్లమూడి' అని వేయడం గమనించవచ్చు. 

'హరిహర వీరమల్లు' చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
Go Back to Shorts
Kollagottinadhiro
Harihara Veeramallu
Promo
Pawan Kalyan
AM Rathnam
Jyothikrishna
Krish Jagarlamudi

More Telugu News