వివేకా కూతురుపై తప్పుడు ఫిర్యాదు చేశారంటూ కృష్ణారెడ్డికి పులివెందుల డీఎస్పీ నోటీసులు
- వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలని బెదిరించినట్లు కృష్ణారెడ్డి ఫిర్యాదు
- సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టారని, సునీత బెదిరించారని ఫిర్యాదు
- కృష్ణారెడ్డి ఆ రోజు తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా నిర్ధారించిన పోలీసులు
దీనిపై విచారణ చేపట్టిన పులివెందుల పోలీసులు కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు నిర్ధారించారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఎస్పీ, సునీత, రాజశేఖర్ రెడ్డి బెదిరించారనే ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చారు. ఈ మేరకు పులివెందుల కోర్టులో డీఎస్పీ మురళీ నాయక్ తుది నివేదికను సమర్పించారు. పోలీసులు సమర్పించిన ఈ నివేదికను మెజిస్ట్రేట్ పరిశీలించనున్నారు.
మరోవైపు, కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశాడని విచారణలో తేలడంతో ఆయనకు డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో 23 మంది సాక్షులను విచారించినట్లు డీఎస్పీ కోర్టుకు తెలియజేశారు.