నాడు సభలో నుంచి గెంటేసిన నేతే నేడు స్పీకర్
- ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజేందర్ గుప్తా
- 2015లో ఆల్కాలంబాపై వివాదాస్పద వ్యాఖ్యలు
- సభలో నుంచి గుప్తాను మోసుకుంటూ బయటకు తీసుకెళ్లిన మార్షల్స్
ఢిల్లీలోని రోహిణి నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన గుప్తాను ఆప్ సర్కారు పలుమార్లు అవమానకర రీతిలో సభ నుంచి బయటకు పంపించింది. ఎన్నో అవమానాలకు గురైన గుప్తా ఇప్పుడు అసెంబ్లీని నడిపే బాధ్యతను చేపట్టడం విశేషం. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్ పేరును బీజేపీ ప్రకటించింది.