తుంగభద్ర నదిలో హైదరాబాద్ యువ వైద్యురాలి గల్లంతు
- స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లిన అనన్యరావు
- తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నీటి ఉద్ధృతికి గల్లంతు
- గజ ఈతగాళ్లు, అగ్నిమాపకశాఖ గాలించినా కనిపించని జాడ
ఈత కోసం నీటిలో దూకడానికి ముందు అనన్య రెడీ అవుతున్న వీడియో వైరల్ అవుతోంది. వన్.. టూ.. త్రీ అంటూ స్నేహితులు కౌంట్ డౌన్ చేయడం కూడా వీడియోలో వినిపిస్తోంది. నదిలో దూకిన తర్వాత పైకి తేలుతూ కాసేపు ఈతకొట్టారు. ఆ తర్వాత గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.
ఆమె గల్లంతైన ప్రదేశంలో తుంగభద్ర నది రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉండటంతో వైద్యురాలు ఆ గుహల్లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక గజ ఈతగాళ్లతోపాటు అగ్నిమాపక దళం నిన్న సాయంత్రం వరకు గాలించినా యువతి జాడను గుర్తించలేకపోయారు. గాలింపు చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సాయం కోరనున్నట్టు పోలీసులు తెలిపారు.