మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్
- హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్ 72 ప్రారంభ, ముగింపు వేడుకలు
- 'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలు
- ఈ ఏడాది మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు పోటీలు
'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు తెలంగాణ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉండనుంది. గతంలో ముంబై, న్యూఢిల్లీల్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.
మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ముంబైలో నిర్వహించారు. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు.