వారికీ అవకాశం... ఎల్ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికీ అవకాశమివ్వాలని నిర్ణయం
- ఎల్ఆర్ఎస్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం
- పది శాతం రిజిస్టరైన లేఔట్లలో మిగిలిన ప్లాట్లకు అవకాశమివ్వాలని నిర్ణయం
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్ధీకరణకు అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పది శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఔట్లలో మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశమివ్వాలని నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.