'శారీ' ముఖ్యమైన రోల్ చేసిన సినిమా ఇది: వర్మ

Saree Movie Update
  • సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన 'శారీ'
  • యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన సినిమా
  • కథానాయికగా ఆరాధ్యదేవి పరిచయం 
  • ఈ నెల 28వ తేదీన నాలుగు భాషలలో విడుదల  

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వంలో 'శారీ' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా కథానాయికగా ఆరాధ్యదేవి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. "ఇది ఒక సైకలాజికల్ థిల్లర్. ఈ జోనర్ కీ .. టైటిల్ కి పొంతన లేనట్టుగా అనిపిస్తుంది. కానీ రెండిటికీ సంబంధం ఉంది. కథ అంతా కూడా ' శారీ' చుట్టూనే తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలో 'శారీ' రోల్ ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేసుకోవడం జరిగింది" అని అన్నారు. 

"అతను ఒక ఫొటోగ్రఫర్ .. ఈ అమ్మాయిని అతను 'శారీ'లో చూస్తాడు. ఆమె పేరు కూడా అతనికి తెలియదు .. 'శారీ' అమ్మాయిగానే గుర్తుపెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఆమెను ఫాలో కావడం మొదలుపెడతాడు. రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రెడీ చేసుకున్నాను. నేను బిజీగా ఉండటం వలన .. కమల్ పై గల నమ్మకంతో దర్శకత్వం బాధ్యత ఆయనకు అప్పగించాను" అని అన్నారు.

Go Back to Shorts
Ram Gopal Varma
Ardhyadevi
Saree Movie
Kamal

More Telugu News