రామ్‌చ‌ర‌ణ్ మూవీపై బుచ్చిబాబు కాన్ఫిడెన్స్ వేరే లెవెల్‌.. ఇదిగో వీడియో!

  • రామ్‌చ‌ర‌ణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'ఆర్‌సీ 16' 
  • ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న భారీ ప్రాజెక్ట్‌
  • తాజాగా 'బాపు' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బుచ్చిబాబు
  • ఈ సంద‌ర్భంగా చెర్రీతో తెర‌కెక్కిస్తున్న మూవీ ప్ర‌స్తావ‌న‌
గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తో రూపొందిస్తున్న సినిమాపై డైరెక్ట‌ర్‌ బుచ్చిబాబు సానా ధీమాగా ఉన్నారు. తాజాగా ఆయ‌న 'బాపు' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చెర్రీతో తెర‌కెక్కిస్తున్న మూవీ గురించి బుచ్చిబాబు మాట్లాడారు.  

తొలి చిత్రం ఉప్పెన రిలీజ‌య్యాక త‌న తండ్రి థియేట‌ర్ గేటు వ‌ద్ద ఉండి అభిమానుల రెస్పాన్స్ అడిగి తెలుసుకున్న‌ట్లు వెల్లడించారు. కానీ, రామ్‌చ‌ర‌ణ్ తో చేస్తున్న సినిమా విష‌యంలో అలాంటిదేమీ అవ‌స‌రం లేద‌ని అన్నారు. దీంతో ఈ మూవీ హిట్ గ్యారెంటీ అని, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఇక 'ఆర్‌సీ 16' వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ తో పాటు చిత్రంలోని ఇత‌ర ప్ర‌ధాన తారా‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. 

ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు ఇత‌ర‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ‌మాన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


More Telugu News