జగన్ ను కలవాలంటూ చిన్నారి ఏడుపు... మాజీ సీఎం ఏం చేశారంటే...!

  • మాజీ సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
  • తన కుమార్తెను తీసుకుని జగన్ ను కలిసేందుకు వచ్చిన అభిమాని 
  • అప్పటికే పెద్ద ఎత్తున గుమిగూడిన‌ కార్యకర్తలు, అభిమానులు
  • ఆ రద్దీలో జ‌గ‌న్ ను కలవలేననుకున్న చిన్నారి ఒక్కసారిగా ఏడుపు
  • అది గమనించి తన కాన్వాయ్ ను ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకున్న జ‌గ‌న్‌
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరుతున్న సమయంలో ఒక అభిమాని తన కుమార్తెను తీసుకుని జగన్ ను కలిసేందుకు వచ్చారు. 

అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉండడంతో ఆ రద్దీలో కలవలేననుకున్న చిన్నారి ఒక్కసారిగా ఏడ్చింది. అది గమనించిన మాజీ సీఎం తన కాన్వాయ్ ను ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దాడారు. దాంతో ఆ పాప కూడా తిరిగి జగన్‌ ను ముద్దాడింది. అనంత‌రం సెల్ఫీ కూడా దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దుల్లేవు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇక ఈరోజు వల్లభనేని వంశీతో జ‌గ‌న్ ములాఖత్ అయ్యారు. దాదాపు అర్ధ‌గంట పాటు ఆయ‌న‌తో ముచ్చ‌టించారు. జ‌గ‌న్ వెంట వంశీ భార్య పంక‌జ‌శ్రీ కూడా ఉన్నారు. కాగా, గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసు ఫిర్యాదుదారైన స‌త్వ‌వ‌ర్ధ‌న్ ను కిడ్నాప్ చేసి బెదిరించార‌ని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన సంగ‌తి తెలిసిందే. 



More Telugu News