అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టండి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో మొత్తం పోలీస్ స్టేషన్ల సంఖ్య 1,392
- 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాల ఏర్పాటు
- సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలన్న హైకోర్టు
గతంలో కూడా పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలపై హైకోర్టులో విచారణ జరిగింది. అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. అయితే, పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలను అమర్చినప్పటికీ నిర్వహణ, సాంకేతిక కారణాల కారణంగా చాలా కెమెరాలు పని చేయడం లేదు. దీంతో, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలులో పురోగతి లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది.