నందిగం సురేశ్ కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట
- అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న కేసు
- ముందస్తు బెయిల్ కోసం సత్తెనపల్లి సివిల్ కోర్టును ఆశ్రయించిన సురేశ్
- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగం సురేశ్ పై వరుస కేసులు నమోదయ్యాయి. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఇటీవలే ఆయన బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యాహ్నం ఆయన కోర్టులో లొంగిపోయారు. ఆయన తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం బయట ఉన్న నందిగం సురేశ్ కు ఈ కేసులో కూడా బెయిల్ లభించింది.