వివాహ వేడుకలో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు
- గజ్వేల్‌లో వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్, శోభ
- వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ అధినేత దంపతులు
- పూలదండలు, ఉంగరాలు తెచ్చి మార్చుకోమని కేసీఆర్ దంపతులను కోరిన పెళ్లివారు
ఈ రోజే కేసీఆర్ జన్మదినం కావడంతో పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వివాహ వేడుక నిర్వాహకులు వేదిక మీదకు పూలదండలు, ఉంగరాలు తీసుకువచ్చారు. కేసీఆర్, శోభ దంపతులను దండలు, ఉంగరాలు మార్చుకోవాలని కోరారు. దీంతో కేసీఆర్, శోభ దంపతులు ఒకరికొకరు దండలు మార్చుకొని, ఉంగరాలు తొడుక్కున్నారు.