మహా కుంభమేళాలో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి: నారా బ్రాహ్మణి
- ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా-2025
- కుటుంబంతో సహా పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేశ్
- ఫొటోలను పంచుకున్న నారా బ్రాహ్మణి
మహా కుంభమేళా-2025లో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి అని అభివర్ణించారు. ప్రయాగరాజ్ లో పవిత్ర స్నానం ఆచరించామని వెల్లడించారు.
ఈ మహిమాన్విత గడ్డపైకి తరలివచ్చిన కోట్లాది మంది సామూహిక విశ్వాసాల నుంచి తాను అద్భుతమైన దివ్య శక్తిని అనుభూతి చెందానని నారా బ్రాహ్మణి వివరించారు. ఈ మేరకు తమ కుంభమేళా పర్యటన ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.





