శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఈ నెల 26న మహా శివరాత్రి
- శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు
- సీఎం చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన శ్రీశైలం ఆలయ ఈవో
ఇవాళ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ వేద పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనం పలికారు. సీఎంను కలిసిన వారిలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.


