ఢిల్లీ విమానాశ్రయంలో 6 కోట్ల విలువైన వజ్రాల నెక్లెస్ స్వాధీనం
- బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి ఖరీదైన నెక్లెస్ అక్రమ రవాణా
- గుజరాత్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఈ నెల 12న బ్యాంకాక్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతను అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వజ్రాలు పొదిగిన 40 గ్రాముల ఈ నెక్లెస్ విలువ సుమారు రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.