జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు... ఇప్పటికే సీఎం సమీక్ష చేశారు: మంత్రి బాలవీరాంజనేయస్వామి

  • ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం
  • గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ మృతి
  • మృతి చెందిన మహిళ స్వస్థలం ప్రకాశం జిల్లా అలసందలపల్లి
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్)తో గుంటూరులో ఓ మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ స్వస్థలం ప్రకాశం జిల్లా అలసందలపల్లి అని గుర్తించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. ఏపీలో జీబీఎస్ కేసులు పెరుగుతుండడంపట్ల ప్రజల్లో భయం నెలకొంది. 

ఈ నేపథ్యంలో, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇది అంటువ్యాధి కాదని స్పష్టం చేశారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఎవరికైనా జీబీఎస్ లక్షణాలు ఉంటే డాక్టర్లు తగిన వైద్యం అందించాలని అన్నారు. 

జీబీఎస్ పై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమీక్ష నిర్వహించారని, ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని మంత్రి బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. జీబీఎస్ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించాలని పేర్కొన్నారు.


More Telugu News