ఆ విద్యుత్ శాఖ ఏడీఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ సతీశ్ రెడ్డి
- హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో స్థిరాస్తులు గుర్తించిన ఏసీబీ
- 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఖాళీ స్థలాలు, విల్లా, భవనాలు గుర్తించిన అధికారులు
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఆయనకు స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఖాళీ స్థలాలు, ఒక విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువనే రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతని నివాసం నుండి బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.