అనంత్ - రాధికల వివాహ వేడుకలపై విమర్శలు.. తాజాగా స్పందించిన నీతా అంబానీ
- బ్లూమ్ బర్గ్ ఇంటర్వ్యూలో విమర్శకులకు జవాబిచ్చిన నీతా
- పిల్లల పెళ్లిని వైభవంగా జరపాలని ప్రతీ పేరెంట్స్ కు ఉంటుందని వివరణ
- తాము కూడా తమ పిల్లలకు అదే చేశామని వెల్లడి
తాజాగా బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతా అంబానీ ఈ విమర్శలపై స్పందించారు. అనంత్ పెళ్లిని ఆడంబరంగా నిర్వహించారనే విమర్శలు మీకు ఇబ్బందిగా అనిపించాయా? అన్న ప్రశ్నకు నీతా అంబానీ జవాబిచ్చారు. ‘పిల్లల పెళ్లి విషయంలో ప్రతి తల్లిదండ్రీ తమకు తోచిన విధంగా ఉత్తమంగా చేయాలనుకుంటారు. మేము కూడా అదే చేశాం. అనంత్ పెళ్లి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని భావిస్తున్నా’ అని చెప్పారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగామని అన్నారు. ఈ విషయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని వివరించారు.