Chandrababu: యాసిడ్ దాడి ఘ‌ట‌న‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశం.. బాధితురాలికి అండగా ఉంటామ‌న్న మంత్రి లోకేశ్‌

CM Chandrababu and Nara Lokesh Strongly Condemned Acid Attack Incident

  • ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో ఘ‌ట‌న‌
  • ఈ దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం చంద్ర‌బాబు
  • బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌న్న సీఎం
  • ఈ ఘ‌ట‌న తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింద‌న్న మంత్రి నారా లోకేశ్‌

ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో ఓ యువ‌తిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్ప‌డ్డాడు. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై జ‌రిగిన‌ ఈ దాడిని సీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. బాధిత యువ‌తికి, ఆమె ఫ్యామిలీకి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. 

అటు ఈ ఘ‌ట‌న‌పై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింద‌న్నారు.  బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండ‌గా నిలుస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. ఆమె ప‌ట్ల అత్యంత పాశవికంగా వ్య‌వ‌హ‌రించిన నిందితుడిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా పోలీసు యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు. 

Chandrababu
Nara Lokesh
Andhra Pradesh
Acid Attack
  • Loading...

More Telugu News