నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం
- దశాబ్దాల నాటి చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్న కేంద్రం
- విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- సభ నుండి వాకౌట్ చేసిన విపక్షాలు
విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.
1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు.