కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- కుటుంబ పోషణ కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
- కుటుంబ జీవన ప్రమాణాలు తగ్గుతాయని ఉద్యోగాలు ఇవ్వకూడదని వ్యాఖ్య
- ఉద్యోగి సంపాదనపైనే కుటుంబం ఆధారపడినప్పుడు మాత్రమే ఇవ్వాలన్న సుప్రీం
వివరాల్లోకి వెళితే... కెనరా బ్యాంక్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే బ్యాంకు ఉన్నతాధికారి దాన్ని తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2 నెలల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది.