నేటి నుంచి మేడారం చిన్న జాతర.. తరలి వస్తున్న భక్తులు
- నేడు మండమెలిగె పండుగతో జాతర ప్రారంభం
- రేపు మండమెలిగె పూజలు.. ఎల్లుండి భక్తుల మొక్కుల చెల్లింపు
- శనివారం మినీ జాతర
నేడు మండమెలిగె పండుగతో జాతర ప్రారంభిస్తారు. రేపు మండమెలిగె పూజలు, ఎల్లుండి (శుక్రవారం) భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్న జాతర నిర్వహిస్తారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం 5.3 కోట్ల రూపాయలు కేటాయించింది.
తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా, జాతర నేపథ్యంలో వనదేవతల దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.