జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల... ఇద్దరు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
- గత నెల 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు
- 14 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్
- ఏపీకి చెందిన మనోజ్ఞ, తెలంగాణకు చెందిన బనిబ్రతకు 100 పర్సంటైల్
ఈ ఏడాది జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరగనుంది.
కాగా, రెండు సెషన్ల నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేస్తారు.