ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన.... స్పందించిన చైర్మన్

  • ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్
  • బాక్సాఫీసు వద్ద విజయవంతం
  • సినిమా విడుదలైన రెండ్రోజులకే బయటికొచ్చిన పైరసీ ప్రింట్
  • బస్సులో తండేల్ ప్రదర్శనపై విచారణకు ఆదేశించిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమాను ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చిత్రబృందం దృష్టికి వచ్చింది. 

సినిమా విడుదలైన రెండ్రోజులకే ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడం పట్ల నిర్మాత బన్నీ వాసు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. బస్సుల్లో పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీనిపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.


More Telugu News