Sensex: ట్రంప్ ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఈ క్రమంలో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311కి పడిపోయింది. నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 23,381 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ బ్యాంక్ (1.20%), భారతి ఎయిర్ టెల్ (0.90%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.48%), టెక్ మహీంద్రా (0.41%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.40%).

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.45%), టాటా స్టీల్ (-3.11%), జొమాటో (-2.87%), టైటాన్ (-2.83%), బజాజ్ ఫైనాన్స్ (-2.15%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News