చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి... వీడియో ఇదిగో!
- రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో దాడి
- రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్న దుండగులు
- రంగరాజన్ నిరాకరించడంతో దాడి
ఈ దాడిపై రంగరాజన్, చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.