బీసీ జనాభా తగ్గించి చూపడంపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
- తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం
- అనంతరం ప్రెస్ మీట్
- బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు
- బీసీ జనాభా గణనపై రీ సర్వే చేపట్టాలని డిమాండ్
కులగణన పూర్తిగా తప్పుల తడక అని, అశాస్త్రీయం అని విమర్శించారు. కులగణన చిత్తు కాగితంతో సమానమని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగలబెట్టాడని వెల్లడించారు. బీసీ జనాభాపై రీ సర్వే చేసి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.