తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది... గెలుపుగా మలుచుకోవాలి: కిషన్ రెడ్డి
- ఢిల్లీలో ఘన విజయం సాధించబోతున్నామన్న కిషన్ రెడ్డి
- ఇదే ఊపుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపు
- బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని వ్యాఖ్య
బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని కిషన్ రెడ్డి చెప్పారు. నిజాయతీతో కూడిన పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేస్తున్నామని... తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉందని... దాన్ని గెలుపుగా మలుచుకోవాలని చెప్పారు.
మరోవైపు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది.