Spcice Jet: విజయ్ దేవరకొండ సహా ప్రముఖులు ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం... టేకాఫ్ కాని స్పైస్ జెట్ ప్లేన్

Technical issue in Spice Jet
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండతో సహా పలువురు ప్రముఖులు ప్రయాణించాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది శంషాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాలేదు. దీంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు రూ.30 వేలు వెచ్చించి టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ విమానం టేకాఫ్ కాకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

స్పైస్ జెట్ విమానం శంషాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సి ఉండగా, ఉదయం 9 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. ఈ విమానంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు.
Go Back to Shorts
Spcice Jet
Aeroplane
Hyderabad

More Telugu News