Gadapa Gadapaku Mana Prabhutvam: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
- వైసీపీ కార్యక్రమంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం
- ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్పు
- ఈ కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని రద్దు చేసింది. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలుత ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. ఎన్నికలకు ఏడాది ముందు జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల అనంతరం ఈ కార్యక్రమాన్ని ఆపివేశారు.