పవన్ కల్యాణ్ కు అస్వస్థత
- వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్
- స్పాండిలైటిస్ కూడా బాధపెడుతోందని తెలిపిన డిప్యూటీ సీఎం కార్యాలయం
- రేపటి కేబినెట్ మీటింగ్ కు హాజరుకాకపోయే అవకాశం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు ప్రకటించారు. వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ కూడా ఆయనను బాధపెడుతోందని వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. అస్వస్థత నేపథ్యంలో రేపు జరిగే కేబినెట్ భేటీకి హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.
మరోవైపు పవన్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' చివరి షెడ్యూల్ ఈరోజు ప్రారంభమయినట్టు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో షూటింగ్ లో ఆయన పాల్గొనలేకపోవచ్చు.
మరోవైపు పవన్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' చివరి షెడ్యూల్ ఈరోజు ప్రారంభమయినట్టు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో షూటింగ్ లో ఆయన పాల్గొనలేకపోవచ్చు.