కోహ్లీపై క‌మిన్స్ ఘోరంగా స్లెడ్జింగ్‌.. ఇదిగో వీడియో!

  • నెట్టింట్ వైర‌ల్ అవుతున్న‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీ యాడ్ వీడియో
  • అందులో కోహ్లీపై నోరుపారేసుకున్న‌ ఆసీస్ సార‌థి 
  • కోహ్లీని నెమ్మ‌దిగా ఆడ‌టం ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదంటూ క‌మిన్స్ స్లెడ్జింగ్‌
ఇటీవ‌ల ముగిసిన బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఇంత‌కుముందు ఎప్పుడూ ఆసీస్‌తో సిరీస్‌లో ర‌న్‌మెషీన్ ఇలా ఫెయిల్ అయింది లేదు. ఈ ఒక్క సిరీస్ మిన‌హా ప్ర‌తిసారి కంగారుల‌పై కోహ్లీ పైచేయి సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వ‌న్డే, ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం కోహ్లీ రెడీ అవుతున్నాడు. 

ఈ క్ర‌మంలో ఈ స్టార్ బ్యాట‌ర్‌ను ఆస్ట్రేలియా సార‌థి పాట్ క‌మిన్స్ స్లెడ్జింగ్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. అదేంటి ఇటీవ‌ల ముగిసిన బీజీటీ సిరీస్ లో కోహ్లీని ఒక్క‌మాట అన‌లేదు క‌దా... ఇదెప్పుడూ జ‌రిగింద‌నే అనుమానం రావొచ్చు. అయితే, ఇది త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం తీసిన యాడ్ వీడియో. ఇందులో క‌మిన్స్ షేవింగ్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ ఉంటాడు. 

ఆ స‌మ‌యంలో ప‌లువురు క్రికెట‌ర్ల‌ను అత‌ను స్లెడ్జింగ్ చేయ‌డం వీడియోలో చూపించారు. అందులో భాగంగానే కోహ్లీని కూడా క‌మిన్స్ స్లెడ్జింగ్ చేశాడు. "హాయ్ కోహ్లీ. ఇప్ప‌టివ‌ర‌కు నీవు ఇలా నెమ్మ‌దిగా ఆడ‌టం చూడ‌లేదు. చాలా అంటే చాలా నెమ్మ‌దిగా ఆడావు" అంటూ వ్యంగ్య‌స్త్రాలు సంధించ‌డం అందులో ఉంది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంకేందుకు ఆల‌స్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


More Telugu News