ప్రాధాన్యత గల అంశాలపై చర్చ ఒక్క రోజులోనే ముగించడం ఏమిటి?: తలసాని
- ప్రభుత్వం చేసిన కులగణన తప్పు అంటున్నామన్న తలసాని
- అది ఎలా కరెక్ట్ అవుతుందో ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్
- సర్వేపై తమకు అనుమానాలున్నాయని వ్యాఖ్య
ప్రభుత్వం చేసిన కులగణన తప్పు అని తాము అంటున్నామని... అది ఎలా కరెక్ట్ అవుతుందో నిరూపించుకోవాలని అన్నారు. సర్వేపై తమకు అనుమానాలు ఉన్నాయని... అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే... బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.