Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రెజిల్‌లో ‘నెల్లూరు’ జాతి ఆవుకు రూ. 40 కోట్ల ధర.. గిన్నిస్‌ బుక్‌లో చోటు!

World most expensive cow sold for Rs 40 Cr
Advertisement
  • బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో వియాటినా-19 అనే ఆవు వేలం
  • దీని బరువు 1,101 కిలోలు
  • గతంలోనూ పలు అవార్డులు అందుకున్న గోవు
  • వీటినే మన దగ్గర ఒంగోలు జాతి ఆవులుగా పిలుపు
  • అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలిగే శక్తి
Advertisement
బ్రెజిల్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు కనకవర్షం కురిపించింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 40 కోట్లకు అమ్ముడుపోయి ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన  వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దీని బరువు ఏకంగా 1,101 కిలోలు. ఇదే జాతికి చెందిన ఆవులతో పోలిస్తే ఇది రెట్టింపు బరువు.

అత్యధిక ధర పలికిన వియాటినా-19 గోవుగా రికార్డులకెక్కిన ఈ ఆవు.. గతంలోనూ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గాను ఇది ‘చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డు అందుకుంది. ఈ ఆవు అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. 

ఇవే ఆవులను మనం ఒంగోలు జాతిగా పిలుస్తుంటాం. ఇవి అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని మనుగడ సాగించగలవు. 1800 సంవత్సరాల్లో ఈ జాతి ఆవులు బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి. వీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
Advertisement
Advertisement
Viatina-19
Brazil
Miss South America
Guinness World Records
Nellore breed
Ongole Cattle

More Telugu News