కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపిన ఫార్మర్స్ అసోసియేషన్!
- ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి హాజరు కావడం లేదంటూ లీగల్ నోటీసులు
- అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో వివరణ కోరాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
- నోటీసులు పంపిన 'ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ'
కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, లేదంటే ప్రతిపక్ష నేతగా ఆయనను తొలగించాలని ఆయన అన్నారు. కేసీఆర్‌కు సమన్లు జారీ చేసి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో వివరణ కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసోసియేషన్ తరఫు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి... మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు.