తెలంగాణ ఈఎపీసెట్ షెడ్యూల్ విడుదల... వివరాలు ఇవిగో!

  • ఫిబ్రవరి 22 నుండి ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ
  • మే 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్ష
  • ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు
తెలంగాణలో ఎంసెట్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈరోజు తెలంగాణ ఈఏపీసెట్, తెలంగాణ పీజీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో తెలంగాణ ఈఏపీసెట్ 2025 కమిటీ తొలి సమావేశం జరిగింది. అనంతరం వెబ్‌సైట్ దరఖాస్తు స్వీకరణ తేదీలు, పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈఏపీసెట్ పరీక్షలను జేఎన్టీయూ నిర్వహించనుంది.

ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2వ తేదీ నుండి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.

పీజీ ఈసెట్ షెడ్యూల్ ఇదే

తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 17 నుండి 19 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. జూన్ 16 నుండి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఐసెట్ పరీక్ష తేదీ విడుదల

ఐసెట్ 2025 పరీక్ష నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. మే 3వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.


More Telugu News