రాష్ట్రపతి భవన్ లో మోగనున్న పెళ్లి బాజాలు.. భవన్ చరిత్రలోనే తొలిసారి
- ఉద్యోగి వివాహానికి ప్రత్యేక అనుమతిచ్చిన ప్రెసిడెంట్ ముర్ము
- ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ పీఎస్ వో పూనమ్ గుప్తా వివాహం
- వరుడు సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవనీశ్ కుమార్
- మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుకలు
వరుడు కూడా సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ఈ ప్రత్యేక అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ వివాహ వేడుకకు అతికొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, మధ్యప్రదేశ్ కు చెందిన పూనమ్ గుప్తా 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఆర్ పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తా సారథ్యం వహించారు.