ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా చల్లా ధనుంజయ

  • ధనుంజయ నియామకానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 
  • ధనుంజయ నియామకంపై నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ
  • కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించనున్న ధనుంజయ
ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది చల్లా ధనుంజయ అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులో పేర్కొంది. 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి  చెందిన ధనుంజయ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసి, 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1983 నుంచి 1987 వరకు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రాక్టీసును హైకోర్టుకు మార్చారు. 2022లో హైకోర్టు ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను ఇచ్చింది. 

.  


More Telugu News