కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్
- కేసీఆర్ కప్ – 2025 పోస్టర్లు విడుదల చేసిన కేటీఆర్
- ఫిబ్రవరి 17న కేసీఆర్ కప్ టోర్నమెంట్
- విజేతగా నిలిచిన జట్టుకు రూ.30 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ
తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కార్యక్రమ నిర్వాహకుడు కొంపెల్లి నరేశ్, నేతలు బోయపల్లి నాగరాజు, కురవ పుల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొంపెల్లి నరేశ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రికెట్ పోటీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.