యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నాం: తెలంగాణ ఉన్నత విద్యామండలి

Telangana Higher education on UGC guidlines
యూనివర్సిటీ వీసీలుగా ఉన్నతాధికారులను నియమించాలనుకోవడం సరికాదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. వీసీల నియామకంలో యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. యూజీసీ మార్గదర్శకాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.

యూజీసీ మార్గదర్శకాలు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయన్నారు. వర్సిటీలు స్వతంత్రంగా ఉండాలన్నారు. ఈ అంశంపై ఒక కమిటీని వేసుకున్నామని, కమిటీ ఇచ్చే రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.

కాగా, రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాల మార్గదర్శకాల్లో మార్పుల చేస్తామంటూ యూజీసీ రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపించింది. వీటి ప్రకారం వీసీలను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. 
Go Back to Shorts
Telangana
BJP
Congress

More Telugu News