మహిళపై దాడిచేసి చంపిన పులి.. 'మ్యాన్ ఈటర్'ను చంపాలని ప్రభుత్వం ఆదేశం
- వయనాడ్‌లోని మనంతవాడిలో మహిళను చంపిన పులి
- ఆమె శరీరంలోని కొంత భాగాన్ని తినేసిన వైనం
- ఆ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించిన కేరళ
పులి వరుస దాడులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అది ఎప్పుడు ఎవరిపై దాడిచేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటిస్తూ దానిని చంపేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారని మంత్రి తెలిపారు.