మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి కన్నుమూత
కేసీఆర్‌కు సకలమ్మ ఐదో సోదరి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పెదిర ఆమె స్వగ్రామం. ఆమె భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఆసుపత్రికి వెళ్లారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సకలమ్మ మృతి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు , ఇతర ముఖ్యనాయకులతో నేడు నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేశారు.