తెలంగాణలో బెనిఫిట్ షోలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలన్న హైకోర్టు
  • అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 వరకు షోలకు అనుమతి ఇవ్వవద్దని సూచన
  • తదుపరి విచారణ వచ్చే నెల 21కి వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.

సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.

ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు.

వాదనలు విన్న న్యాయస్థానం... సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఈ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం గం.8.40 మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వవద్దని, ఈ చట్టాన్ని అనుసరించాలని వ్యాఖ్యానించింది.


More Telugu News